బాల సాహిత్యం సేవకు గుర్తింపు
యదార్థవాది ప్రతినిధి సిరిసిల్ల
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అవార్డులు ప్రకటించింది.. పలు రంగాలకు చెందిన మొత్తం 27 మందిని ఈ స్పెషల్ అవార్డులకు ఎంపిక చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళీకేరి ఉత్తర్వులు జారీచేశారు. 2023 సంవత్సరానికి మొత్తం 27 మంది మహిళలను అవార్డుతో పాటు ఒక్కొక్కరికి 1 లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని ప్రభుత్వం అందజేయనుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రముఖ రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డ్ కు ఎంపికైంది. బాల సాహితి మహిళా శిశు అభ్యుదయం ప్రమాదకర జబ్బుల అవగాహన కల్పించేందుకై రచనలు కథలు కవితలు వ్యాసాలు పజిల్స్ సైన్స్ వ్యాసంగం మొదలైన రచనల ద్వారా ప్రయత్నించారు. పిల్లల విద్య పాఠశాల సమస్యలపై వ్రాసిన వ్యాసాలు వివిధ దినపత్రికల్లో ప్రచురించబడ్డాయి.