34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణబిజేపిదే మెదక్ పార్లమెంట్ సీటు: ఈటల రాజేందర్.

బిజేపిదే మెదక్ పార్లమెంట్ సీటు: ఈటల రాజేందర్.

బిజేపిదే మెదక్ పార్లమెంట్ సీటు: ఈటల రాజేందర్.

కొండపాక యదార్థవాది

నవంబర్ 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నియోజకవర్గబీజేపీ అభ్యర్థి గా పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్ శుక్రవారం కుకునూర్ పల్లి లోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మండల అధ్యక్షుడు మన్నెం శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కెసిఆర్ డబ్బు మద్యం పంచడంతో పాటు అధికార బలం ఉపయోగించి మాత్రమే గజ్వేల్ లో గెలిచారని బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రివర్యులు ఈటెల రాజేందర్ అన్నారు. గజ్వేల్ లో కేవలం ఈటల రాజేందర్ కాకుండా ప్రజలు న్యాయం ధర్మం అన్ని ఓడిపోయాయి అన్నారు. గజ్వేల్ లో ఇంతవరకు బీజేపీ నుండి సరైన పెద్ద నాయకుడు లేకున్నా  నేనిచ్చిన పిలుపుతో రేపటి మా నేత ఈటెల అంటూ 66653 ఓట్లు బిజెపికి వేశారన్నారు. అయినానప్పటికి ఓటమి చెందినప్పటికీ గజ్వేల్ ప్రజలకు అందుబాటులోనే ఉంటానని హామీ ఇచ్చారు. రేపటి పంచాయితీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవడం కోసం  బిజెపి నాయకులకు, కార్యకర్తలకు తన వంతు సహకారం చేస్తా అన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా పదవి ఉన్నా లేకపోయినా నా బతుకంతా కొట్లాటనే అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో స్వరాష్ట్రంలో అనేకమంది ముఖ్యమంత్రులు కొట్లాడిన బిడ్డను అన్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రజలు సునామీ ఓట్లతో కేసీఆర్ ను గద్దేదించారన్నారు. కేసీఆర్ అహంకారంతోనే పదేళ్ల అధికారం కుప్పకూలిందన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అంటేనే మోడీ ఎన్నికలు అని దేశ ప్రజలు మాట్లాడుతున్నారు. రాబోయే మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో కచ్చితంగా బిజెపి గెలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడి పల్లి భాస్కర్ బిజేపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం గురువారెడ్డి నాయకులు మాదాడి జస్వంత్ రెడ్డి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు గడ్డమీది రామస్వామి, కొండపాక ఉప సర్పంచ్ ఆరే భాస్కర్ అంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ బడేకొల్ నర్సింహులు ఉమ్మడి కొండపాక మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్