భారత రాజ్యాంగం ఏర్పాటే 26 జనవరి
యదార్థవాది ప్రతినిది హుస్నాబాద్
హుస్నాబాద్ పట్టణంలోని మంజులక్క యువసేన కార్యాలయంలో గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన సామాజిక సేవకురాలు కర్ణకంటి మంజులరెడ్డి.. యువసేన కార్యాలయం నుండి అక్కన్నపేట చౌరస్తా వరకు ర్యాలీ గా వెళ్లి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ర్ అంబేద్కర్ పూలమాల వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ దేశాలల్లో భారత రాజ్యాంగం చాలా గొప్పదని, ప్రతి ఒక్కరు రాజ్యాంగ స్పూర్తికి అనుగుణంగా, మన దేశ ప్రజలందరూ ఆత్మ గౌరవంతో, సమానత్వంతో జీవిస్తూ, దేశ ఉన్నతకి పాటుపడుతూ, ప్రజాస్వామ్యం పరిరక్షణ కూ ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమం లో మహిళాలు, యువకులు,యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు..