మన రాజ్యాంగాన్ని గౌరవిద్దాం
శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు.
యదార్థవాది ప్రతినిధి శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యదర్శి బి.కుమార్ రాజు జాతీయ పతాకావిష్కరణ చేసి ఆయన మాట్లాడుతూ దేశపు రాజ్యాంగ అమలు ప్రారంభమైన రోజుని గణతంత్ర దేశంగా ప్రకటించుకుని జరుపుకునే “జాతీయ పండుగ”. భారతదేశంలో గణతంత్ర దినోత్సవం రాజ్యాంగం అమలులోకి వచ్చిన 1950 జనవరి 26 రోజున గౌరవంగా జరుపు కుంటారు. స్వేచ్ఛ సమానత్వం న్యాయం సౌబ్రతత్వం అందించిన మన రాజ్యాంగాన్ని మనమందరం కాపాడుకుందాం గౌరవిద్దాం అన్నారు ఈ కార్యక్రమంలో శంకరరావు రమణ మూర్తి, చిరంజీవులు, యోగానంద్, గ్రంథాలయ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.