34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణమల్లన్నను వెంటనే విడుదల చేయాలి

మల్లన్నను వెంటనే విడుదల చేయాలి

మల్లన్నను వెంటనే విడుదల చేయాలి

యదార్థవాది ప్రతినిధి నిజామాబాద్

క్యూ న్యూస్ జర్నలిస్టు మల్లన్నపై అక్రమ కేసులు పెట్టి నిర్బంధించడంపై నిజామాబాద్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు బుస్సాపూర్ శంకర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులతో జర్నలిస్టుల గొంతు నొక్కాలని చూడడం సరైన పద్దతి కాదని అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటున్న జర్నలిస్టులను వారి కుటుంబాలను భయభ్రాంతులకు గురి అయ్యేలా దాడులకు దిగడం సరైనది కాదని అక్రమ కేసులతో పత్రికా స్వేచ్ఛను నిర్బంధించడం తగదని తక్షణమే తీన్మార్ మల్లన్న పై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయలని అన్నారు. తీన్మార్ మల్లన్న ను మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి ఇప్పటివరకు ఆచూకీ తెలపడం లేదని ఆవేదన చెందుతున్న తీన్మార్ మల్లన్న భార్య ఆమె తెలంగాణ ఆడబిడ్డ కాదా.. ఇప్పటికైనా మల్లన్న ఆచూకీ తెలపాలని బుస్సాపూర్ శంకర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కుంచెపు ఆనంద్ యువజన నాయకులు కారంపూరి రవి కుమార్ అంకర్ గణేష్ సంతోష్ సాగర్ సాయిరాం బగ్గీలి కృష్ణ మహిళ నాయకులు రేఖ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్