మావోయిస్టుకు ఆర్థికసహాయం
కరీంనగర్ యదార్థవాది
మావోయిస్టు డిసియంగా పనిచేసి ఇటీవల లొంగిపోయిన రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేట మండలం శివంగులపల్లికి చెందిన నేరేళ్ళ జ్యోతి అలియాస్ జ్యోతక్కకు కరీంనగర్ పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు 5లక్షల రూపాయల ఆర్థికసహాయం చెక్కును శుక్రవారం పోలీస్ కార్యాలయంలో అందజేశారు.. మావోయిస్టు నేరేళ్ళ జ్యోతి గతనెల 12న పోలీస్ కమీషనర్ ఎల్ సుబ్బరాయుడు ఎదుట లొంగిపోయిన విషయం విదితమే. ప్రభుత్వ అందజేసిన ఆర్ధికసహాయాన్ని శాశ్వత అవసరాలకోసం వినియోగించుకోవాలని పోలీస్ కమీషనర్ సూచించారు.