23.6 C
Hyderabad
Friday, September 12, 2025
హోమ్తెలంగాణమొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు విష్వశాంతికి మార్గదర్శాకాలు

మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు విష్వశాంతికి మార్గదర్శాకాలు

మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు విష్వశాంతికి మార్గదర్శాకాలు

* యావత్తు మానవాలికి మొహమ్మద్ చివరి ప్రవక్త .
* తోటి మానవులతో సద్భావనే నిజమైన జీవితం

* ఘనంగా మిలాద్-ఉన్-నబి

* సిద్దిపేట లో భారీ శాంతి ర్యాలీ

సిద్దిపేట యదార్థవాది

ఇస్లాం ధర్మం శాంతికి నిదర్శమని, శాంతి, సమసమాజ స్థాపనే ఇస్లాం ముఖ్య ఉద్దేశ్యం అని ఉలేమాలు, తంజీమ్ ఉల్ మసాజిద్ ఇంచార్జ్ అధ్యక్షులు నయ్యర్ పటేల్ అన్నారు. ఆయన ఒక్క ఇస్లాం ధర్మనీకె కాకుండా ఆయన మొత్తం మానవాళికి ప్రవక్త అన్నారు. మొహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని పస్బానే మిల్లత్ మిలాద్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం సిద్దిపేట లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. మొహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు జీవన విధానానికి సూచికలు అని అన్నారు. ర్యాలీ పట్టణంలోని బస్టాండ్ వద్దగల ఫిర్దౌస్ మస్జీద్ నుండి ప్రారంభమయిన ర్యాలి మెదక్ రోడ్డు గుండా మహాత్మాగాంధీ పార్క్ వద్దనుండి సాగుతూ ఇక్బాల్ మినార్ మీదుగా ముస్తాబద్ చౌరస్తా నుండి తిరిగి ఈద్గా వద్ద ఉన్న దర్గా లో ప్రార్థన చేసేవరకు కొనసాగింది..ప్రార్థనల అనంతరం సొసైటీ , ముస్లిం మత పెద్దలు మౌలానా ఖురేషి,మొహమ్మద్
రఫీ,మొహమ్మద్ గౌస్, కరీం పటేల్, మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త కారణ జన్ముడని ఆయన చూపిన బాటలో నడిస్తే జీవితం అంత సుఖ శాంతులతో నడుస్తున్నది అన్నారు. ఆయన మొత్తం మానవాళికి ఆదర్శప్రాయుడని కొనియాడారు. మన తోటి వారు తిన్నారో లేదో తెలుసుకోకుండా మనం తినవద్దని సూచించారని …ఒక్క మానవుని అకారణంగా హతమార్చితే మొత్తం మానవాళిని హతమార్చిన పాపమ్ మూతగట్టుకున్నట్టే నని హితబోధ చేశారన్నారు… ఇప్పటికి స్త్రీలపై వివక్ష ఉందని కానీ మహిళలకు ఉన్నతమైన స్తానాన్ని కల్పించిన ఘనత మొహమ్మద్ ప్రవక్త దేనన్నారు… తండ్రి ఆస్తిలో సమాన భాగాన్ని ఆయన స్త్రీలకు అందేశారని గుర్తుచేశారు… సహనం,ఓపిక,శాంతి,ధర్మం, లాంటి నిరడంబరా జీవితం ఎవరైతే గడుపుతారో వారు భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రులు అవుతారని ఉద్ఘాటించారు.. తల్లి పాదాల కింద స్వర్గం ఉంటుందని…తండ్రి స్వర్గం తెరిచే ద్వారామని ఆయన బోధించారు.తల్లి దండ్రులకు మీరు సేవిస్తే జీవితం సఫలమైనట్టేనాని తెలిపారన్నారు… ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని గంగ జమున తహజీబ్ తో కలిసి ఉండాలని సూచించారు. సిద్దిపేట ఏసీపీ సురేందర్ రెడ్డి, సీఐ లు కృష్ణ రెడ్డి, రవి కుమార్,రామకృష్ణ,చేరాలు, భాను ప్రకాష్ ల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు
నిర్వహించారు. కార్యక్రమం అనంతరం ఏసీపీ సురేందర్ రెడ్డి మాట్లాడుతూ రాలి శాంతియుతంగా నిర్వహించారని కొనియాడుతూ నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. అనంతరం అన్న వితరన కార్యక్రమం నిర్వహించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్