యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
మహాపాదయాత్రకు జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం
యదార్థవాది ప్రతినిధి సూర్యాపేట
యాదవుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు మేకల రాములు అన్నారు కొండగట్టు వద్ద చేపట్టిన యాదవ మహాపాదయాత్ర సోమవారం జిల్లా కేంద్రంలోని శ్రీ లింగమంతుల స్వామి దేవాలయం కు చేరుకోగా పొల్ల నరసింహారావు యాదవ్ స్వాగతం పలికారు అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభాలో 20 శాతం ఉన్న యాదవులకు రాజకీయంలో విద్యలో సరైన అవకాశాలు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 1970 వ సంవత్సరంలో యాదవుల కోసం ఏర్పాటుచేసిన రిజర్వేషన్ రద్దు చేయడం జరిగిందని తిరిగి రిజర్వేషన్ల పునరుద్ధరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో యాదవుల సంక్షేమానికి 5,000 కోట్లను నిధులు కేటాయించాలని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో యాదవుల కోసం నిధులు కేటాయించకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు అన్ని రాజకీయ పార్టీలు యాదవులను ఓటు బ్యాంకుగా చూస్తూ ఎన్నికల సమయంలో మాత్రమే వాడుకొని తర్వాత వదిలేస్తున్నాయన్నారు. ఏ రాజకీయ పార్టీ అయితే తమ మేనిఫెస్టోలో యాదవుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని తెలుపుతాయో ఆ పార్టీకి యాదవుల పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో చిలకల శ్రీనివాస యాదవ్, తిరుగుడు రవి యాదవ్, వీరబోయిన గురుస్వామి యాదవ్, మరల శ్రీనివాస్ యాదవ్, ఎల్లావుల రాము యాదవ్, వంగూరి అంజి యాదవ్, లలిత, భారీ అశోక్ ,వీరబోయిన లింగయ్య తదితరులు పాల్గొన్నారు