30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణయువకులే లక్ష్యంగా హనీట్రాప్

యువకులే లక్ష్యంగా హనీట్రాప్

యువకులే లక్ష్యంగా హనీట్రాప్

ఇద్దరు మహిళలు సహా 12 మంది అరెస్ట్

హైదరాబాద్: యువకులను లక్ష్యంగా చేసుకొని హనీట్రాప్ చేస్తున్న ముఠాను హైద్రాబాద్ సెంట్రల్ జోన్ పోలీసులు సోమవారం నాడు అరెస్ట్ చేశారు.ఈ ముఠా నుండి రెండు డమ్మీ పిస్టళ్లతో పాటు రూ. 1.5 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఆ ముఠాకు సంబంధించిన వివరాలను సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చంద్ర ఇవాళ మీడియాకు వివరించారు. మహిళలతో వ్యాపారులు, యువకులకు వల వేసి డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా డీసీపీ చెప్పారు. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా ఈ తరహా ఘటనలు మరో మూడు కూడా వెలుగు చూశాయని డీసీపీ తెలిపారు. అమాయకంగా ఉండే యువకులను లక్ష్యంగా చేసుకొని మహిళతో హనీట్రాప్ చేయిస్తున్నారని పోలీసులు చెప్పారు. తాము ఎంచుకున్న యువకుడు లేదా వ్యాపారుల వద్దకు మహిళను పంపి పరిచయం పెంచుకొనేలా చేస్తారు . మహిళ …బాధితులతో ఫోటోలు దిగుతుంది. బాధితుడు మహిళను నమ్మినట్టుగా భావించిన తర్వాత ఈ ముఠాలోని ఇతర సభ్యులు రంగంలోకి దిగుతారని డీసీపీ రాజేష్ చెప్పారు. తాము ఎంచుకున్న వారిని హోటళ్లకు వచ్చేలా ప్రేరేపిస్తారని కూడా తమ దర్యాప్తులో గుర్తించినట్టుగా పోలీసులు చెప్పారు. హోటళ్ల వద్దకు వచ్చిన సమయంలో ఫోటోలు తీసి బ్లాక్ మెయిళ్లకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.మహిళతో బాధితుడి దిగిన ఫోటోను చూపి బెదిరింపులకు పాల్పడుతారని పోలీసులు తెలిపారు. పోలీస్ శాఖ, మీడియా అంటూ బాధితులను నిందితులు బెదిరించేవారని పోలీసులు చెప్పారు. గత ఏడాది జూన్ నుండి డిసెంబర్ వరకు సెంట్రల్ జోన్ పరిధిలో ఆరు కేసులు నమోదైనట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఇంకా ఎవరెవర్ని మోసం చేసిందనే విషయమై ఆరా తీస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ముఠా ఇప్పటికే సుమారు రూ. 8.5 లక్షలను దోచుకుందని తమ దర్యాప్తులో గుర్తించామని పోలీసులు వివరించారు.

ఈ ముఠాలో ముగ్గురు మహిళలున్నారని పోలీసులు తెలిపారు. ముఠాలో సభ్యరాలిగా ఉన్న ఓ మహిళ పరారీలో ఉందని డీసీపీ రాజేష్ చెప్పారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టుగా చెప్పారు. అరెస్టైన నిందితులను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్