కెరటాల్లో చిక్కుకుని యువకుడ్ని సేవ్ చేసిన బ్లూఫ్లాగ్ బీచ్ లైఫ్ గార్డులు
యదార్థవాది ప్రతినిధి విశాఖపట్నం
విశాఖపట్నం రుషికొండ బీచ్ వద్ద సముద్రం లో మునిగిపోబోతున్న ఓ యువకుడిని టూరిజం బ్లూఫ్లాగ్ బీచ్ లైఫ్ గార్డులు రక్షించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి చెంది న ఎనిమిది మంది విహార యాత్రలో భాగంగా తీరానికి వచ్చారు. వీరంతా స్నానాలు చేస్తుండగా అమిత్ అనే యువకుడు కెరటాల్లో చిక్కుకుని కేకలు వేస్తున్న విషయాన్ని లైఫ్‌గార్డులు ఎస్.నూకరాజు, శ్రీనివాస్ గుర్తించారు. సకాలంలో ఒడ్డుకు చేర్చి ప్రాథమిక చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. తర్వాత వారికి కౌన్సిలింగ్ నిర్వహించి పంపివేశారు. యువకుడి ప్రాణాలు కాపాడిన గార్డులను టూరిజం అధికారులు, పోలీసులు, పర్యాటకులు అభినందించారు.
యువకుల్ని సేవ్ చేసిన బీచ్ లైఫ్ గార్డులు
RELATED ARTICLES





