రెండవ విడత కంటి వెలుగుపై..సమీక్షా
నల్లగొండ: 7 జనవరి యదార్థవాది
నల్లగొండ జిల్లా పట్టణంలో రెండవ విడత కంటి వెలుగు అవగాహన సదస్సు కార్యకమంలో విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పాల్గొన్నరు. తెలంగాణ రాష్ట ప్రభుత్వ ఆధ్వర్యంలో కంటి వెలుగు అవగాహన సదస్సు కార్యక్రమన్ని శనివారం MNR గార్డెన్స్ నిర్వహించారు. ఈ కార్యకమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఏమ్మేలే శ్రీమతి గొంగిడి సునీత, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, సూర్యాపేట నల్గొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్లు, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.