వంగరామయ్యపల్లి లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: తెలంగాణ ఇస్తే ఆంధ్రాలో పార్టీ నష్టపోతుందని తెలిసినా.. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ తన పుట్టినరోజు సందర్భంగా 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించారు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నేడు కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ పుట్టినరోజును సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని వంగ రామయ్య పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఆటపాటలతో సిద్దిపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ కేడం లింగమూర్తి మండల పార్టీ అధ్యక్షులు బంకచందు ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటం ముందు గిరిజన మహిళలతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మహిళలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.