వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వంమే.
-కాలేశ్వరం ప్రాజెక్టులో దొరికిపోయిన దొర ప్రభుత్వం..
-మళ్ళీ దళిత బందు పేరుతో నాటకాలు..
-ఎమ్మెల్యే అభ్యర్థి పూజల హరికృష్ణ..
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్యెల్యే అభ్యర్థి పూజల హరికృష్ణ ఆధ్వర్యంలో నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ గ్రామంలో దాదాపు 100 మందికి పైగా దళితులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జక్కాపూర్ గ్రామంలో ఆనాడు కాంగ్రెస్ హయాంలో 7ఎకరాలు భూమి పట్టాలతో సహా ఇండ్ల స్థలాలకు కేటాయించి, అదే విధానం ఆ స్థలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయించి ఇచ్చిందని, ఎంతో మంది భూమి లేని నిరుపేదలైన ఎస్సై, ఎస్టీ, బీసీలకు వ్యవయం భూమిని పట్టాలతో అందించిందని గ్రామంలో ఏ మూలన చూసిన ఇందిరమ్మ గృహాలే కనిపిస్తున్నాయ్, దొరల ప్రభుత్వం వచ్చాక ఇండ్లు లేవు, భూమి లేదు, పట్టాలు లేవు కనీసం దళితులను పట్టించుకున్న పాపాన లేదని అన్నారు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని విధాలా సబ్బండ వర్గాలకు మేలు జరుగుతుందని అన్నారు. అదే విదంగా దళిత కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బొమ్మల యాదగిరి మాట్లాడుతూ ఆనాడు కాంగ్రెస్ ఎస్సి సబ్ ప్లాన్ తీసుకువచ్చి దళితుల్లో వెలుగులు నింపితే ఈనాడు దాన్ని కొల్లగొట్టి, దళిత బందు అని డ్రామాలు ఆడుతూ అందరి మధ్య చిచ్చు పెట్టి విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ దొరల మాటలు విని దళితుకు, బిసిలు ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి దూరం కావద్దు అని తెలిపారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు బర్మ రామచంద్రము, అర్బన్ అధ్యక్షులు భిక్షపతి, యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు చింతల రాజ్ వీర్, మండల నాయకులు అశోక్, సీనియర్ నాయకులు పల్లె శ్రీనివాస్, తీగల భాస్కర్, నర్సయ్య, సారుగు హరికృష్ణ, చిన్న బాలయ్య, సారుగు కనకయ్య, జక్కుల కనకయ్య, బొడ్డు బల్ రాజు, మల్లికార్జున్, శరబందు, చంద్రం, రాములు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.