విడాకులు ఇచ్చింది నా భార్యకె… నా పిల్లల తల్లికి కాదు… నటుడు ప్రకాష్ రాజ్
నటుడు ప్రకాష్ రాజ్ తన మొదటి భార్య లలిత కుమారి కి విడాకులు ఇచ్చి 2010 ఆగస్టులో పోనీ వర్మ అనే కొరియోగ్రాఫర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే వీరికి వేదాంత్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే ప్రకాష్ రాజ్ మొదటి భార్యతో ముగ్గురు పిల్లలు అయ్యారు. అందులో ఇద్దరు కూతుర్లు ఒక కొడుకు. 5 ఏళ్ల వయసులో వయస్సున్న కొడుకును ప్రకాష్ రాజ్ కోల్పోయాడు ఇదిలా ఉంటే ప్రస్తుతం మా ఎన్నికల వేడిలో కీలకంగా మారిన ప్రకాష్ రాజ్ తన లైఫ్ గురించి కొన్ని విషయాలను వెల్లడించారు. తన మొదటి భార్య లలిత కుమారి కి ఎందుకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందో వెల్లడించారు. తన భార్య తో పడక కోర్టుల వరకు వెళ్ళవలసి వచ్చింది విడాకులు తీసుకున్నాము కానీ నా భార్యకు మాత్రమే విడాకులు ఇచ్చాను పిల్లలకు కాదు,. నా తల్లి తన కోడలికి ఇవ్వలేదు విడాకులు కేవలం మా ఇద్దరి అంశం మాత్రమే నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనిపించి నా పెద్ద కూతురు అమ్మ చెల్లి లను అడిగాను. నా పెద్ద కూతురు వెరీ గుడ్ డాడీ అని చెప్పింది ఆ తర్వాత నే నేను పెళ్లి చేసుకున్నాను. నా కూతురు పెళ్లి చేయాల్సివస్తే నేనే నేనే ముందు ఉంటాను.