విద్యారంగానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించాలి
ఏఐఎస్ఎఫ్ సిద్దిపేట జిల్లా కార్యదర్శి జేరిపోతుల జనార్ధన్
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
ప్రభుత్వాలు ప్రవేశ పెట్టబోయే వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జేరిపోతుల జనార్దన్ అన్నారు మంగళవారం సిద్దిపేట లోని ఎడ్ల గురువారెడ్డి భవన్ లో ఆయన ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సంగెం మధు,వర్కింగ్ ప్రెసిడెంట్ రామగళ్ల నరేష్ లతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్లో విద్యకు కనీస ప్రాధాన్యత ఇవ్వడం లేదని,కొఠారి కమిషన్ సిఫార్సు చేసిన విధంగా కేంద్ర బడ్జెట్లో విద్యకు 10% నిధులు రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 30% నిధులు ఇవ్వాల్సి ఉండగా కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి,బీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యారంగం పట్ల చిన్నచూపు చూస్తున్నాయని మండిపడ్డారు.. కేంద్ర బడ్జెట్లో గత 8 సంవత్సరాల నుంచి విద్యకు మూడు శాతం మించి నిధులు ఇవ్వడం లేదని,కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యారంగాన్ని కుంటు పడేలా చేస్తుందని,అదే విధంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న నుండి బిఆర్ఎస్ ప్రభుత్వం గత ఎనిమిది సంవత్సరాలుగా విద్యకు నిధులు తగ్గిస్తూ వస్తుందని,కేవలం 2014-15 బడ్జెట్లో 10.89% శాతం నిధులు కేటాయించి తర్వాత నుండి 2022 వరకు ప్రతి బడ్జెట్లో విద్యకు నిధులు తగ్గిస్తూ ఆరు శాతం నిధులు మంజూరు చేస్తుందని,తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు విద్యారంగానికి అధిక నిధులు కేటాయిస్తామని,విద్యార్థుల భవిష్యత్ బంగారుమయం చేస్తానని వాగ్దానాలు చేసిన కేసీఆర్ ఆ హామీలను తుంగలో తొక్కి ప్రభుత్వ విద్యను నాశనం చేస్తుందని అన్నారు..పొరుగు రాష్ట్రాలు అయిన కేరళ మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో 25% పైగా నిధులు కేటాయిస్తు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంటే మన రాష్ట్రంలో ఇలా ఆరు శాతం కేటాయిస్తూ మన రాష్ట్రాన్ని అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోమ్మని చెప్పడం చూస్తుంటే సిగ్గు అనిపిస్తుందని వారు వాపోయారు..రాబోయే బడ్జెట్ సమావేశాల్లో వల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 30% నిధులు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వం 10% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు..లేనిపక్షంలో ప్రభుత్వాల విద్యార్థి వ్యతిరేక విధానాలను ఎండగడుతాం అని ఆయన హెచ్చరించారు..