30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణవిద్యార్థికి సముద్రాల ట్రస్తు ఆర్థిక సహాయం

విద్యార్థికి సముద్రాల ట్రస్తు ఆర్థిక సహాయం

విద్యార్థికి సముద్రాల ట్రస్టు ఆర్థిక సహాయం

సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి

ఉన్నత విద్య చదవలనుకున్న విద్యార్థినికి ఆర్థిక ఇబ్బంది తలెత్తడంతో సిద్దిపేటకు చెందిన సముద్రాల చారిటబుల్ ట్రస్టు ఆర్థిక సహాయం అందించింది. గజ్వేల్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన దుబాషి అరుణ భానుప్రసాద్ దంపతుల కుమార్తె అర్చన గుజరాత్ రాష్ట్రంలో ఎన్ ఎఫ్ ఎస్ యూ లో ఇంటిగ్రేటెడ్ బీ టెక్ సైబర్ క్రైం కోర్సులో ప్రస్తుతం రెండవ సంవత్సరం చదువుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే స్కాలర్షిప్ ను ఆ యూనివర్సిటీ అనుమతించలేదు. దాంతో అర్చనకు సంవత్సరానికి కాలేజీ ఫీజు సుమారు లక్ష పది వెలు, హాస్టల్ కు సుమారు లక్ష 50 వేలు చెల్లించాలి. నిరుపేద కుటుంబానికి చెందిన అర్చన తండ్రి 8నెలల క్రితం కాలువిరిగి మంచంపట్టాడు. అమ్మాయి కి ఫీజు చెల్లించే పరిస్థితి లేక కాలేజీ నుంచి వచ్చి ఇంటి వద్దనే ఉంటుంది. సిద్దిపేటకు చెందిన సముద్రాల చారిటబుల్ ట్రస్టు వ్యవస్థాపకులు, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు శ్రీనివాస్ విషయం తెలుసుకుని గురువారం అర్చనకు రూ.10వెల ఆర్ధిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్కాలర్షిప్ రాదనే విషయం తెలియక తన కూతురు గుజరాత్ లోని యూనివర్సిటీ లో చేరిందని విద్యార్థిని తల్లి అరుణ తెలిపింది. దినసరి కూలి చేస్తూ పిల్లల్ని చదివించుకునే పరిస్థితి లో భర్త ప్రమాదానికి గురయ్యారని దాంతో అతడు కూలి పనికి వెళ్లడం లేదని చెప్పింది. ప్రభుత్వం కానీ దాతలు ముందుకొచ్చి తన కూతురు ఉన్నత చదువు కోసం సహాయపడలని వేడుకుంది. తనకు గత సంత్సరం పాటుగా ఆర్థికంగా ఆదుకుంటున్న సముద్రాల ట్రస్టు కు రుణపడి ఉంటామని అర్చన చెప్పింది.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్