అనంతలో విద్యార్థులపై లాఠీచార్జీ చేసిన పోలీసులు. అనంతపురం లోని ఎస్ ఎస్ బి ఎన్ ఎయిడెడ్ కళాశాలల విలీనం ఆపాలని విద్యార్థులు సోమవారం ఆందోళన చేపట్టారు. కళాశాల ఎదుట రోడ్డుపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠఛార్జి చేశారు. విద్యార్థులకు పోలీసులు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో విద్యార్థుల చెదరగొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులపై విద్యార్థులు రాళ్లు వేశారు. దీంతో విద్యార్థులపై పోలీసుల లాఠిచార్జ్ చేయగా ఓ విద్యార్థి తనకు గాయమైంది. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆందోళన మరింత ఉదృతం చేశారు. విద్యార్థులను అరెస్టు చేయాలని పోలీసు నుంచి కిందకు విద్యార్థులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులను అరెస్టు చేసిన వాహనంలో తరలిస్తుడగా విద్యార్థి అడ్డుకున్నారు. విద్యార్థులపై లాఠీ చార్జ్ చేస్తారా..? అంటూ విద్యార్థి నాయకులు. విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్క్ తరలించారు. ఈ గందరగోళం లో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడం తో జయలక్ష్మి అనే విద్యార్థిని తలకు గాయమైనది. పోలీసులు మాత్రం లాఠీఛార్జ్ చేయలేదని, విద్యార్థుల గుంపును చదరగోటమని డి.ఎస్.పి వెల్లడించారు.