విద్యార్థులు క్రీడల్లో రాణించాలి..
-విద్యార్థులకు అభినందనలు తెలిపిన మండల విద్యాధకారి ఉపాధ్యాయులు
చేర్యాల, యదార్థవాది డిసెంబర్ 12:
మద్దూరు మండలంలో నిర్వహించిన సీఎం కప్పు క్రీడా పోటీలలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రేబర్తి విద్యార్థిని విద్యార్థులు వివిధ క్రీడలలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులను మద్దూరు మండల విద్యాధికారి వరదరాజు, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయుడు చంద్ర భాను అభినందించారు. ఈ సందర్భంగా విద్యాధికారి మాట్లాడుతూ విద్యతోపాటు క్రీడల్లో రాణించాలని ఇందుకు విద్యాలయాలలోని క్రీడలకు బీజం పడుతుందని తెలిపారు. అనంతరం మండలంలో నిర్వహించిన క్రీడలలో పురుషుల విభాగంలో వాలీబాల్ ప్రథమ స్థానాన్ని గెలుపొందారు అదేవిధంగా కోకోలొ ద్వితీయ స్థానం మహిళా విభాగం కోకోలో ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారని తెలిపారు. అట్టి విద్యార్థులను జిల్లాలో జరిగే సీఎం కప్పు పోటీల్లో పాల్గొని విజయం సాధించాలని భవిష్యత్తులో బాగుగా చదువుకుంటూ మంచి క్రీడాకారులుగా రూపుదిద్దుకోవాలని ఆశీర్వదించారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు శిరీష సంపత్ చంద్రారెడ్డి రవి మల్లేశం శ్రీనివాస్ రెడ్డి నరసింహులు ప్రశాంత్ కవిత మొదలగు వారు పాల్గొన్నారు విద్యార్థులు కార్తీక్ దుర్గాప్రసాద్ సాత్విక్ రోహిత్ రెడ్డి మల్లికార్జున్ నందకిషోర్ రమేష్ రుచిత నిహారిక భార్గవి మంగ జోష్ణ మొదలగు వారిని అందరూ అభినందించారు