శబరిమల ఆదాయం రూ.318 కోట్లు.!
కేరళ: యదార్థవాది ప్రతినిది
రెండేళ్లు కరోనా విజృంభణ తర్వాత పూర్తి స్థాయిలో శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులకు అనుమతించారు..2018 లో అత్యధికంగా రూ.260 కోట్లు వచ్చాయని..శుక్రవారంతో వార్షిక తీర్థయాత్ర సీజన్ ముగియనుండగా.. ఈ సీజన్లో ఇప్పటివరకు రూ.318 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని, లెక్కింపు పూర్తయ్యేసరికి రూ.330 కోట్లకు చేరవచ్చని అధికారులు తెలిపారు. ఈ సారి భక్తులు పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారని, చిన్నారులు సైతం దర్శనానికి పోటెత్తారని, మొక్కులు, కానుకలను అయ్యప్పకు సమర్పించారు. హుండీల్లో నోట్ల లెక్కింపు పూర్తయిందని,
కాయిన్లను లెక్కించాల్సి ఉందని, మరో రూ.ఏడు కోట్ల వరకు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు..మొత్తం ఆదాయం రూ.330 కోట్ల చేరవచ్చని అధికారులు తెలిపారు..