సంక్షేమ వసతి గృహ విద్యార్థులపై దృష్టి సారించండి
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని, హాస్టల్ వార్డెన్ లు స్థానికంగా ఉంటూ విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేసేలా చూడాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి జనార్దన్ అన్నారు..మంగళవారం రోజున కలెక్టరేట్ బీసీ సంక్షేమశాఖ అభివృద్ధి అధికారికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా జనార్ధన్ మాట్లాడుతూ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇంటర్మీడియట్,10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వసతి గృహాల వార్డెన్లు స్థానికంగా హాస్టల్ లో ఉంటూ టైం టేబుల్ ప్రకారం ప్రతి విద్యార్థి పై ప్రత్యేక శ్రద్ధ చూపించాలని విద్యార్థులకు సమయానికి మెనూ ప్రకారం భోజనం అందించి,మానసిక శారీరక ఒత్తిళ్లకు గురి చేయకుండా పరీక్షలకు సన్నద్ధం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో సంగెం మధు రామగళ్ల నరేష్ తదితరులు పాల్గొన్నారు