27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణస్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలి 

స్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలి 

స్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంప్ లు నిర్వహించాలి 

సూర్యాపేట యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 15: స్వచ్ఛంద సంస్థలు హెల్త్ క్యాంపులు నిర్వహించి పేద ప్రజలను ఆదుకోవాలని పిసిసి నాయకులు సూర్యాపేట పబ్లిక్ క్లబ్ కార్యదర్శి కొప్పుల వేనారెడ్డి తెలిపారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బేబీ మూన్ స్కూల్ లో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ సహకారంతో  ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంప్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పేద ప్రజలకు జబ్బులు వస్తే కార్పొరేట్ హాస్పిటల్ లో చూపించుకుండే ఆర్థిక స్తోమత ఉండదని,ఒక రక్త పరీక్ష చేయించాలన్న సుమారు 200 రూపాయలు ఖర్చు వస్తుందని, ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయటం వల్ల పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేసినట్లయితే ప్రజలు  ఎక్కువగా వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. హైదరాబాదు యశోద ఆసుపత్రికి చెందిన 13 మంది వైద్యులు, సిబ్బంది ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్ నందు బిపి, సుగర్, ఇసిజి, కార్డియాలజి, బోన్ స్కానింగ్ , స్త్రీలకు సంబంధించిన వ్యాధి పరీక్షలు  పేదలకు ఎంతగానో ఉపయోగపడుతాయని అన్నారు. గతంలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఆయన సతీమణి వరూధిని దేవి జ్ఞాపకార్థం జిల్లాలో పెద్ద ఎత్తున  కంటి పరిక్షలు నిర్వహించి, కంటి ఆపరేషన్ లను ఉచితంగా నిర్వహించారని అన్నారు. రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిటెక్  మూడో సంవత్సరం చదువుతున్న  పేద విద్యార్ది మందడి రోహిత కు లాప్ టాప్ ను అందజేశారు. హెల్త్ క్యాంప్ కు సహాయంగా స్ధానిక వ్యాపారి యామా ప్రభాకర్ 15 వేల రూపాయల మందులను ఉచితంగా అందివ్వడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంజద్ ఆలి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి అభినయ్, కరీమ్ బేగ్, తంగెళ్ల కరుణాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పోలేబోయిన నర్సయ్య యాదవ్, కోదాడ ఆర్యవైశ్య సంఘం నాయకులు వెంపటి వెంకటేశ్వరరావు, రెడ్డి సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, అధ్యక్షులు గోదాల రంగారెడ్డి, ఉపాధ్యక్షులు సునీల్ రెడ్డి, కోశాధికారి చిలుముల శ్రీనివాస రెడ్డి, సభ్యులు కట్కూరి చంద్రారెడ్డి, వెంకట్రామిరెడ్డి, సైదిరెడ్డి, వెన్న వెంకటరెడ్డి, దండ వెంకటరెడ్డి, కాకి మల్లారెడ్డి, సూరం అనిల్ రెడ్డి, నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్