స్వచ్ఛతా హీ సేవలో పాల్గొన్న వ్యవసాయ కళాశాల విద్యార్థులు.
సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది
భారత ప్రభుత్వం స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని 15 సెప్టెంబర్ నుండి 02 అక్టోబర్ వరకు జరుపుతున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏక్ తారీఖ్ – ఏక్ గంట కార్యక్రమాన్ని 01 అక్టోబర్ 2023 తేదీన ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రమదానం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుమేరకు బాబు జగ్జీవన్ రామ్ వ్యవసాయ కళాశాల, సిరిసిల్ల జాతీయ సేవా పథకం యొక్క విద్యార్థి వాలంటీర్లు జిల్లెల్ల పల్లె దవాఖాన నూతన గ్రామపంచాయతీ పరిసరాల్లో చెత్తను శుభ్రం చేశారు. అంతేకాకుండా స్వచ్ఛతను ఇంటా బయటా గ్రామంలో ప్రతి చోట పాటించాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల జాతీయ సేవా పథక పర్యవేక్షణ అధికారులు డాక్టర్ టి అరుణ్ బాబు, కె భవ్య శ్రీ, విద్యార్థులు, జిల్లెల్ల గ్రామ సర్పంచ్ మాట్ల మధు, అంగన్ వాడి సిబ్బంది మరియు గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.