హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీ: చాడ వెంకటరెడ్డి
యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్
బిజెపి హటావో దేశ్ బచావో అనే నినాదంతో ఏప్రిల్ 14 నుండి మే 15 వరకు దేశ వ్యాప్తంగా పల్లె పల్లెకు తీసుకుని వెళుతున్నట్లు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి తెలిపారు.. శుక్రవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిజెపి పార్టీ హిందూ రాజ్యం పేరిట దేశంలో మతచిచ్చు రేపుతోందని సెంటిమెంట్ రాజకీయాలతో అధికారంలో ఉంటూ పబ్బం గడుపుతుందని తొమ్మిది సంవత్సరాల కాలంలో బిజెపి 15 లక్షల కోట్లు అప్పు చేసి దేశాన్ని తాకట్టు పెట్టిందని బిజెపిలో ఉన్నవారు పవిత్రులని ఇతర పార్టీల నాయకులపై సిబిఐ ఈడి దాడులు చేయిస్తుందని ఆయన అన్నారు. టోల్ పై 5 శాతం ఔషధాలపై 12 శాతం పన్నులు పెంచి పేదలపై పెను భారం మోపుతోందని ప్రజలు కమ్యూనిస్టులను గెలిపిస్తే ప్రజా గొంతుకగా ఉంటామని చాడ వెంకటరెడ్డి అన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి మంద పవన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడిపే మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.