అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలి
నిజామాబాద్ యదార్ధవాది
అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు నల్ల వస్త్రాలు ధరించి స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి బస్టాండ్ భగత్ సింగ్ చౌరస్తా రైల్వే ఓవర్ బ్రిడ్జి మార్కెట్ యార్డ్ దుబ్బ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ కు వినతి పత్రం సమర్పించారు.. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు నూర్జహాన్, ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్ అయాలు సమస్యలు పరిష్కరించాలని అనే సార్లు అధికారులకు ప్రభుత్వానికి విన్నవించుకున్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో సోమవారం దేశవ్యాప్త కోర్కెల దినోత్సవం గా నిర్వహించడం జరిపామని వారు తెలిపారు.. అంగన్వాడీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని, పిఎఫ్ ఈఎస్ఐ అమలు జరపాలని, హెల్త్ స్కీమును ప్రకటించి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించాలని, సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాట్యూటీ పెన్షన్స్ సౌకర్యాన్ని కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్ కు 5లక్షలు ఆయాలకు 3లక్షలు ఇవ్వాలని పది సంవత్సరాల నుండి బకాయి ఉన్న డిఏడిఏ లను చెల్లించాలని, అధికారులు వేధింపులను నిరోధించాలని వారు కోరారు.. కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షులు దేవగంగు, ప్రధాన కార్యదర్శి స్వర్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వై గంగాధర్, సిఐటియు నాయకులు కే రాములు, అంగన్వాడీ యూనియన్ నాయకులు చంద్రకళ, వాణి, సూర్య కళ, జ్యోతి, గోదావరి, యమునా, లక్ష్మి, తదితరులతోపాటు పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు ఆయాలు పాల్గొన్నారు..