అంబులెన్స్ హామీ మరిచిన ఆరోగ్య మంత్రి.!
- -బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ నియోజకవర్గ కోహెడ మండలంలో అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్ సేవలు ఏప్పుడు అందుతాయని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.. సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రంలో పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థానిక ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు సొంత జిల్లాలోనే ఆరోగ్య శాఖ పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్రంలో ఎలా ఉంటుందని అన్నారు. బిజెపి పార్టీ నేతృత్వంలో గత సంవత్సర కాలం నుండి కోహెడ మండల కేంద్రంలో 108 అంబులెన్స్ అవసరమని మంత్రి, ప్రభుత్వం దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లిన ఎలాంటి స్పందనలేదని, అంబులెన్స్ కావాలని స్వలాభాన్ని ఆశించకుండా ప్రజల కోసం మండలంలోని అన్ని పార్టీల యువకులు ఆదివారం కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ధర్నా నిర్వహించగా అధికార బలంతో ఎమ్మెల్యే సతీష్ బాబుకు వారిపై కేసులు నమోదు చేయించడం ఏంటని ఆయన అన్నారు.. గతంలో కోహెడలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు త్వరలో కోహెడకు అంబులెన్స్ ను మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చి కొన్ని నెలలు గడుస్తున్నా ఇంతవరకు హామీ నెరవేర్చ లేదని మంత్రి ఇచ్చిన హామీ మరిచారా అని ఎద్దేవా చేశారు.. ఇప్పటికైనా మంత్రి హరీష్ రావు కలగజేసుకొని కోహెడ మండలానికి 108 అంబులెన్స్ మంజూరు చేయాలని, ధర్నా చేసిన యువకులపై పెట్టిన కేసులను బేషరతుగా తొలగించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టేందుకు బిజెపి వెనుకాడబోదని తెలిపారు. ఈ సమావేశంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు పెళ్లి నరసయ్య గౌడ్ జలిగం రమేష్ గుగ్గిల శ్రీనివాస్ బండ జగన్ కంది సత్యనారాయణ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు..