అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలి
యదార్థవాది ప్రతినిది విశాఖపట్నం
రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న అక్రిడేషన్ సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస గోపాలకృష్ణను బుధవారం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్లో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు పోతుమహంతి నారాయణ్ కోరగా అందుకాయన సానుకూలంగా స్పందించారు. అక్రిడేషన్లు జారీ అంశం పరిశీలిస్తున్నామని ఈ ఏడాది అక్రిడేషన్లు జారీలో సరళతరమైన విధానాలు అమలు చేసి ఆలోచన ఉందని ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున దాని గురించి ఇప్పుడు మాట్లాడ్డం సబబుగా ఉండదని మంత్రి పేర్కొన్నారు.. కోడ్ ముగిశాక ఈ అంశమై ప్రధానంగా చర్చించి జర్నలిస్టులకు న్యాయం చేస్తామన్నారు.