అభివృద్ధిని చూసి ఆకర్సితులైన ప్రజలు
రాజన్న-సిరిసిల్ల 20 డిసెంబరు 2022
అభివృద్ధిని చూసి ఆకర్షితులైన ప్రజలు మంగళవారం సిరిసిల్ల జిల్లా వేములవాడలో రూ. 20 కోట్లతో చేపట్టనున్న VTDA, TUIFDC పనులకు, రూ.52 కోట్లతో చేపట్టనున్న ఆర్ అండ్ బి, పంచాయితీ రాజ్ రెన్యువల్ పనులకు డా సినారె కళా మందిరం అవరణలో మంత్రి కే తారక రామారావు శంకుస్థాపన చేసి ఆయన మాట్లాడుతూ తెలంగాణలో మనము అన్ని రకాల అభివృద్ధిని సాధించుకున్నాం అది చూసి సరిహద్దు గ్రామాల ప్రజలు మన తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై మహారాష్ట్ర కు చెందిన 14 గ్రామాల సర్పంచ్ లు, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రజలు తమ గ్రామాలను తెలంగాణ లో విలీనం చేసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి నీ పదే పదే కోరుతున్నారనీ మంత్రి కే తారక రామారావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను తమ రాష్ట్రంలోనూ అమలు చేయాలని అక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారన్నారు. ఇక్కడేమో కొందరు విమర్శకులు పొద్దున లేస్తే కేసీఆర్‌ను తిట్టడమే పనిగా పెట్టుకున్నాయి.. వారు శాపనార్థాలు పెడితే.. మీరే కాపాడాలి. మీ ఆశీస్సులు ఉంటే.. కేసీఆర్‌ను ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అనురాగ్ రావుల శ్రీధర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు.