అసత్య ప్రచారాలు మానుకోండి: మాజీ ఎమ్మెల్యే వొడితెల
* పార్లమెంట్ ఎన్నికలలో మా సత్తా ఏంటో చూపిస్తాం.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
మంత్రి పదవిలో ఉండి తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని
మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ బాబు అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కు అన్ననే లేడు అన్న కూతురు ఎక్కడినుండి వచ్చింది.. బోయినపల్లి అనే ఇంటి పేరు ఉంటే బంధువు అయినట్టేనా అని దుయ్యబట్టారు. ఇదివరకే మాజీ పార్లమెంటు సభ్యులు వినోద్ కరీంనగర్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఖండించారన్నారు. మంత్రి హోదాలో ఉండి పొన్నం సంబంధిత శాఖల నుండి పూర్తి వివరాలను తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక బీఆర్ఎస్ పై తప్పుడు ప్రచారాలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే మంత్రి పొన్నం పనిచేస్తున్నారని మరో సారి తప్పుడు ఆరోపణలు చేస్తే తాము కూడా మాటకు మాట సమాధానం చెప్పుతాంమని రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మా సత్తా ఏంటో చూపిస్తామని తెలిపారు. హుస్నాబాద్ అభివృద్ధి కెసిఆర్ ప్రభుత్వంలోనే జరిగిందని నియోజకవర్గములో ఇప్పటి వరకు ఎస్టీ రోడ్లు సీడీపీ నిధులు ఇతర అభివృద్ధి కోసం వచ్చిన నిధులన్నీ రద్దు చేయించారని తెలిపారు.