34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఅసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సమీకృత మార్కెట్.!

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సమీకృత మార్కెట్.!

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా సమీకృత మార్కెట్.!

– త్వరగా నిర్మాణం పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురండి

– తెలంగాణ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేశ్

గోదావరిఖని యదార్థవాది

తెలంగాణ లేబర్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని విటల్ నగర్ లో నూతనంగా నిర్మిస్తున్న కూరగాయల మార్కెట్ ను సందర్శించారు. అనంతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గొర్రె రమేశ్ మాట్లాడుతూ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా నిర్మాణం కాక అసంపూర్తిగా మిగిలిపోయిందని, భవనానికి సంబంధించిన నిర్మాణ మెటీరియల్ మొత్తం దొంగల పాలవుతున్నదని అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు రాక తీవ్రంగా నష్టపోతున్నారని, నిర్మాణం ఆగిపోవడంతో భవనము నిర్మానుషంగా మారి అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారి చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నిర్మాణం ఆగిపోవడం వల్ల కోట్ల రూపాయల ప్రజాధనం నిరుపయోగం అవుతుందని, మార్కెట్ అందుబాటులోకి వస్తే వ్యాపారస్తులకు,ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని, మున్సిపల్ కార్పొరేషన్ కు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అన్నారు.వెంటనే రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరుకంటి చందర్ స్పందించి నిర్మాణాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అల్లపు తిరుపతి,బాజా వెంకటేష్,కన్నం భానుచందర్, జి అఖిల్ వర్మ,చెరుకు పైడి, తగరం సాయిలు,సురేష్, రాజయ్య, మల్లయ్య,ఓదెలు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్