30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఆటో నగర్ లోని సమస్యలు పరిష్కరించిన..జిల్లా కలెక్టర్

ఆటో నగర్ లోని సమస్యలు పరిష్కరించిన..జిల్లా కలెక్టర్

ఆటో నగర్ లోని సమస్యలు పరిష్కరించిన..జిల్లా కలెక్టర్

సిద్దిపేట: 12 యదార్థవాది ప్రతినిది

జిల్లలో కొత్తగా నిర్మిస్తున్న ఆటో నగర్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి, ముండ్రాయు శివారులో నిర్మిస్తున్న ఆటో నగర్ ప్రాంతాన్ని క్షేత్ర స్థాయిలో గురువారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఇటీవలే 26ఎకరాల విస్తీర్ణంలో మోడ్రన్ ఆటో నగర్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన గుర్తు.. ఇక్కడ భూమి ఎత్తు పల్లాలతో చదును చేసి ఒకే లెవల్ చేయడానికి ఎస్టిమేట్ కంటే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతుంది అని కాంట్రక్టర్ జగదీశ్వర్ రెడ్డి తెలపగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. స్థానిక ఇంజనీరింగ్ అధికారులు ముందు స్థలాన్ని చూడకుండా ఎలా తక్కువగా ఎస్టిమేట్ చెస్తారని అసహనం వ్యక్తం చేశారు. ఆటో నగర్ కి కావాల్సిన అదనపు నిధులను మంజూరు చేస్తామని వీలైనంత తొందరలో నిర్ణీత గడువు లోపు పూర్తి చెయ్యాలని తెలిపారు. ముఖ్యంగా తారు రోడ్డు, డ్రైనేజీ, వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్ తప్పనిసరి గా ఏర్పాటు చెయ్యాలని సూచించారు. కలెక్టర్ వెంట ఆర్డిఓ అనంతరెడ్డి, ఆర్బన్ తహసిల్దార్ విద్యాసాగర్, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్