ఆదరించి జగన్ రుణం తీర్చుకోండి

359

ఆదరించి జగన్ రుణం తీర్చుకోండి
-బద్వేలు లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థి కోసం డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్ ప్రచారం
అందరూ తప్పకుండా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రుణం తీర్చుకోవాలని డెప్యూటీ సీఎం అంజాద్ బాషా కోరారు. ఆయన కడప జిల్లా బద్వేలు నియోజకవర్గము లో అభ్యర్థి దాసరి సుధ తో ప్రచారం లో పాల్గొన్నారు. మనకు మేలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి అండగా నిలిచే అవకాశం ఉపఎన్నికల ద్వారా వచ్చిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభివృద్ధి, సంక్షేమాన్ని అందిస్తున్నారు. మునిసిపల్ వార్డుల్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అందరూ తప్పకుండా ఆదరించి భారీ మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రి రుణం తీర్చుకోవాలి.. బద్వేల్ కు మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించారు.. ఎంత కరవు పరిస్థితులు వున్నా నీళ్లు అందేలా చేశారని, సాగునీరు కోసం బ్రహ్మసాగర్ నుంచి కాలువలు నిర్మిస్తున్నారన్నారు. చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి , కడప మేయర్ సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి