ఆదివాసీల అతి పెద్ద జాతర నాగోబా:అర్జున్ ముండా..
ఆదిలాబాద్: యదార్థవాది ప్రతినిది
రాష్ట్రంలోనే రెండో అతిపెద్ద జాతర ఆదివాసీల నాగోబా జాతర అని కేంద్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అర్జున్ ముండా అన్నారు.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని ఆదివాసీల ఆరాధ్య దైవం నాగోబా జాతర శనివారం ప్రారంభంమైంది..జాతరను సందర్శించిన మంత్రి నాగోబా ఆలయ అభివృద్ధికి సహకారం అందిస్తామని అన్నారు.. మెస్రం వంశీయులు వారి ఆచారం ప్రకారం మహాపూజలు నిర్వహించి జాతర ఉత్సవాలు ప్రారంభించారు. ఈ నెల 25 వరకు కొనసాగనున్న జాతరకు ఏర్పాట్ల ఘనంగా నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి బేటింగ్ (కొత్త కోడళ్ల పరిచయం), 22న జాతర, భక్తుల దర్శనం, ప్రత్యేక పూజలు, 23న ఆదివాసీ దేవుళ్లు పెర్సాపేన్, బాన్‌పేన్‌లకు పూజలు, 24న దర్బార్ నిర్వహించనున్నారు. 25న బేతాల్‌పూజ, మండగాజలింగ్ (ముగింపు కార్యక్రమం)తో జాతర ముగుస్తుంది.
