34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్క్రీడలుఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

ఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రతినిది నిజామాబాద్

నిజామాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్ 2023 కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు తో కలసి ప్రారంభించరు.. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్ పరేడ్ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ చేసి ఒలంపిక్ కాగడ చేత భూని క్రీడాజ్యోతిని పరేడ్ గ్రౌండ్ చుట్టు రన్ చేసి, ప్రతిజ్ఞ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రం శాంతి భద్రతతో ఉందంటే అది పోలీసుల విధి నిర్వాహన అని, యునిఫామ్ సర్వీస్ లో ఉన్నటువంటి వారు 24 X 7 విధినిర్వహణలో ఉంటారని, ఇతర శాఖల వారికి సెలవు దినాలు ఉంటాయని, కానీ పోలీస్ సిబ్బందికి ఎలాంటి సెలవులు, పండుగలు ఉండవని, వారు ఎల్ల ప్పుడు విధినిర్వహణలో ఉంటారని, అలాంటి నిర్విరామ విధులలో ఉన్న పోలీసులకు ఈ ఆన్వాల్ స్పోర్ట్స్, గేమ్స్ మీట్-2023 అనేది ఉత్సాహాంతో పాటు ఉల్లాసాన్ని కలిగిస్తుందని తెలిపారు. ఎల్లప్పుడు పని వత్తిడితో తట్టుకోవడానికి, ఈ క్రీడలు ఎంతో ఉపయోగపడుతాయని, క్రీడల వల్ల వ్యక్తులకు వ్యక్తులకు మధ్య ఒక చక్కని బంధం ఏర్పడుతుందని అయన అన్నారు. క్రీడలు స్నేహపూర్వక వాతావరణంలో నిర్వహించడం ఎంతో అభినందనీయమని, గెలుపోటములను ఏదైనా స్పూర్తిగా తీసుకోవాలని, క్రీడా కారులు జిల్లాస్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాలని కలెక్టర్ తెలిపారు. పోలీస్ కమీషనర్ నాగరాజు మాట్లాడుతూ గతకొన్ని సంవత్సరాలుగా కోవిడ్ వలన క్రీడలు నిర్వహించలేదాని, ఇప్పుడు సాధారణ వాతావరణం ఉన్నందున క్రీడలు మళ్లీ నిర్వహిస్తున్నామని, మన పోలీస్ విభాగంలో విధినిర్వహణలో క్రీడలు అనేవి ఎంతో అవసరమైనవని, మనం అందరం ఎంతో కఠినమైన పరిస్థితి ఎదుర్కొన వలసి వస్తుంది అని, శారీరకంగాకాని, క్రీడలు అంటేనే ఒక పండుగ వాతావరణం అని సిబ్బంది తెలిపారు. పోటీలు మూడు రోజుల పాటు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ సబ్ డివిజన్ లలో ఆర్ముడ్ రిజర్వు, హోమ్ గార్డ్సు విభాగం, అలైడ్ బ్రాంచ్లు, పోలీస్ కార్యాలయం సిబ్బంది జట్ల మధ్య వాలీబాల్, బాస్కెట్ బాల్, కబడీ, హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్, డిస్కస్ త్రో, జవలిన్ మరియు అథెలిటిక్స్ క్రీడలు జరుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమీషనర్ గిరిరాజు, ఎ.సి.పిలు కిరణ్ కుమార్, ప్రభాకర్రావ్, నారాయణ, సంతోష్ కుమార్, శ్రీనివాస్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్స్ శ్రీశైలం, రిజర్వు ఇన్స్పెక్టర్స్ అనిల్ కుమార్, శెలేందర్, శేఖర్, పెద్దన్న కుమార్, ఆర్.ఎస్.ఐ లు, పి.ఇ.టి లు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్