ఆప్త మిత్రుడు అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే
యదార్థవాది ప్రతినిధి ఆర్మూర్
ఆప్తమిత్రుడు మృతితో దిగ్బ్రాంతికి లోనైనా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. విద్యుత్ ఘాతానికి గురై ఆర్మూర్ నవనాధ సిద్దలగుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి దుర్మరణం చెందారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, స్థానిక ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆర్మూర్ పట్టణ నవనాథ సిద్దుల గుట్ట ఆలయ కమిటీ చైర్మన్ ఏనుగు శేఖర్ రెడ్డి బుధవారం తెల్లవారుజామున తన వ్యవసాయ క్షేత్రంలో విద్యుత్ ఘాతానికి గురై దుర్మరణం చెందారు. శేఖర్ రెడ్డి మరణించిన వార్త తెలిసి ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. హైదరాబాద్ నుంచి హుటాహుటిన ఆర్మూర్ చేరుకుని ఎమ్మెల్యే దంపతులు జీవన్ రెడ్డి రజిత రెడ్డిలు తమ కుటుంబ సభ్యులతో కలిసి శేఖర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. శోక తప్త హృదయంతో తన సన్నిహితుడు శేఖర్ రెడ్డి పాడేమోసి కన్నీటి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన సతీమణి కన్నీరు మున్నీరుగా విరపిస్తూ శేఖర్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శేఖర్ రెడ్డి మరణం బిఆర్ఎస్ పార్టీ తో పాటు వ్యక్తిగతంగా తనకు తీరని లోటు అని కంటనీరు పెట్టుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ శేఖర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే ధైర్యం చెప్పారు.