ఆయిల్ ఫామ్ తోటలపై సమీక్షించిన: కలెక్టర్
యదార్థవాది ప్రతినిధి సిద్దిపేట
సిద్దిపేట జిల్లా మండలాల వారిగా ఫిబ్రవరి మాసానికి నిర్దేశించిన విధంగా ఆయిల్ ఫామ్ మొక్కలను నాటేలా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ వ్యవసాయ అధికారులను టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.. సోమవారం జిల్లా కలెక్టర్ జిల్లాలోని అన్ని మండలాల వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటల పెంపకం పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ ఫామ్ విస్తరణ ఇప్పటివరకు జిల్లాలో 8000 ఎకరాలలో సాగు జరుగుతోందని అదేవిధంగా ఫిబ్రవరి నెలలో జిల్లాకు 2217 ఎకరాల లక్ష్యాన్ని 23 మండలాల వ్యవసాయ అధికారులకు మండలాల వారిగా టార్గెట్ ఇవ్వడం జరిగిందని, ఇప్పటివరకు 410 ఎకరాలకు రైతులను గుర్తించమని క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులతో సమీక్షలు నిర్వహించి కొత్త రైతులను గుర్తించలని, ఫిబ్రవరి నెలలో లక్ష్యాన్ని చేదించాలని జిల్లా కలెక్టర్ మండల వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో జిల్లా వ్యవసాయ అధికారి శివ ప్రసాద్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి రామలక్ష్మి, వ్యవసాయ సహాయ సంచాలకులు, ఉద్యాన అధికారులు, టీఎస్ ఆయిల్ పేడ్ అధికారులు పాల్గొన్నారు..