29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఆర్ఆండ్ఆర్ కాలనీ క్షేత్ర స్థాయిలో పర్యటించిన: జిల్లా కలెక్టర్

ఆర్ఆండ్ఆర్ కాలనీ క్షేత్ర స్థాయిలో పర్యటించిన: జిల్లా కలెక్టర్

ఆర్ఆండ్ఆర్ కాలనీ క్షేత్ర స్థాయిలో పర్యటించిన: జిల్లా కలెక్టర్

యదార్థవాది ప్రదినిది సిద్దిపేట

సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్న ఆర్ఆండ్ఆర్ కాలనీలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ గురువారం గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లి గ్రామ శివారులో మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలు నివసిస్తున్న ఆర్&ఆర్ కాలనీలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి కలెక్టర్ పర్యటించారు.. మల్లన్న సాగర్ ముంపుగ్రామాలు ఎర్రవల్లి, సింగారం, వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామాల వాసుల ఆర్&ఆర్ కాలనీలో అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఓపెన్ ప్లాట్ల, ఓక్కో గ్రామ సర్పంచ్, ప్రజాప్రతినిధులతో చర్చించారు. ఓపెన్ ప్లాట్ల చెయ్యాల్సిన లే అవుట్ పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, ఎలక్ట్రిసిటీ పనులు త్వరగా పుర్తి చేయ్యాలని, వాటర్ ట్యాంకు, డ్రైనేజీ వ్యవస్థ, మిషన్ భగీరథ నీటి సమస్య, వైకుంఠదామాలు, గుడులు, అంగన్వాడి, అక్కడక్కడా అసంపూర్తిగా వున్నా పనులను తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. ఆర్&ఆర్ కాలనీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ప్రహరీ గోడ వద్ద పెద్ద బండ ఉన్నందున దాని పక్కన ఎత్తున ప్రహరీ గోడ నిర్మించాలని, పక్కనే నిర్మిస్తున్న అదనపు తరగతి గదుల పనులను పరిశీలించారు, పాఠశాలల్లో సమారు 330 మంది పిల్లలు చదువుకుంటున్నరని, వారికి మీషన్ భగిరథ కనెక్షన్ ఇప్పించాలని, మన ఊరు మన బడి పథకంలోలా పాఠశాలకు కలరింగ్ స్టిల్ బోర్డు తో పేరును పెట్టాలని, మంపు గ్రామ ప్రజలు ఎ ఓక్కరు నష్టపోకుండా అందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డిఓలు, అనంతరెడ్డి విజేందర్ రెడ్డి, టిఎస్ఈడబ్లుఐడిసి ఈఈ శ్రీనివాస్ రెడ్డి డిఈ మదుసుదన్, మిషన్ భగీరథ డిఈ సుమలత, కాంట్రాక్టర్లు, నిర్మాణా ఎజెన్సీ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్