దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఆర్‌ఆర్‌ఆర్.ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) ప్రమోషన్స్ షురూ అయ్యాయి. ఇందులో భాగంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ టీమ్ సినీ ప్రేమికులందరికీ సోమవారం ఉదయం ఓ స్పెషల్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. 45సెక్లన పాటు కొనసాగిన ఈ వీడియో రిలీజ్ అయిన కాసేపటికే ట్రెండింగ్‌లో నిలిచింది. ఇప్పటివరకూ వచ్చిన సర్‌ప్రైజ్‌లకు భిన్నంగా రామ్‌చరణ్-తారక్ కలిసి ఉన్న సన్నివేశాలతో ఈ వీడియో రూపొందించారు.
ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు అలరించనున్నాడు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగన్ కీలక పాత్ర పోషించారు. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత. ఈ ప్రతిష్టాత్మక చిత్రం 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది.