34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఆశ వర్కర్ల సమస్యపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: చాడ వెంకటరెడ్డి 

ఆశ వర్కర్ల సమస్యపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: చాడ వెంకటరెడ్డి 

ఆశ వర్కర్ల సమస్యపై ప్రభుత్వానికి లేఖ రాస్తా: చాడ వెంకటరెడ్డి 

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు న్యాయం చేయాలని  18000 వేల వేతనం ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె 5వ రోజు సందర్భంగా ఆదివారం హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరాహార దీక్ష చేస్తున్న కార్యకర్తలకు సంఘీభావంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆశా కార్యకర్తలు అనేక పని ఒత్తిడిని తట్టుకొని ప్రజలకు  నిత్యం వైద్య సేవలు అందిచటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి  కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు. ఆశాలకు కనీస వేతన నిర్ణయం చేయాలని సమ్మె చేస్తుంటే తెలంగాణ రాష్ట్ర కెసిఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని కనీస వేతనం18000 వేలు పెంచెంత వరకు పోరాటం సాగించాలని, ప్రభుత్వం వెంటనే ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం చర్చలకు పిలవాలని చాడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ఆశా కార్యకర్తలను దేవతలు అని పొగిడిన పాలకులు కనీస వేతనం నిర్ణయం చేయడానికి చలనం లేదని అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు కాపాడిన మహిళ సైనికులు ఆశా కార్యకర్తలని ప్రభుత్వ సంక్షేమ పథకాలైన కంటి వెలుగు, లెప్రసీ, మలేరియా, టిబి, షుగర్ వంటి దీర్ఘ కాలిక వ్యాధుల  గుర్తింపులో అత్యున్నత పాత్ర పోషిస్తున్నా ఆశా కార్యకర్తల సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావుకు లేఖ రాస్తానని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు, గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ,సిపిఐ మండల నాయకులు ఎర్రవెల్లి తిరుపతి,ఆశా కార్యకర్తలు దుబాల రజిత, జాల వాణి, ఉమ్మపుర్ రేనుక, బొద్దుల వెన్నెల, చింతల పూజ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్