ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన
యదార్థవాది ప్రతినిది బెంగళూరు
వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షోను ప్రారంభించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. సోమవారం ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన, విమానాల విన్యాసాలను తిలకించిన నరేంద్రమోదీ, కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఈ ప్రదర్శనతో ఎన్నో అవకాశాలకు రన్‌వేగా నిలుస్తుందాని, ‘ద రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్’ పేరిట నిర్వహిస్తున్న ప్రదర్శన నేటి నుంచి ఐదు రోజుల పాటు జరగనుందాని, ఈ ఏడాది రికార్డు స్థాయిలో 98 దేశాలు ప్రదర్శనలో పాల్గొంటునయని తెలిపారు. భారతీయ, విదేశీ రక్షణ రంగ సంస్థలు ప్రదర్శనలో భారీ ప్రదర్శనకారుల విభాగంలో తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. వీటిల్లో ఎయిర్‌బస్, బోయింగ్, లాక్హీడ్ మార్టిన్, ఇజ్రాయెల్ ఏరోస్పేస్, బ్రహ్మోస్ ఏరోస్పేస్, ఆర్మీ ఏవియేషన్, హెచ్‌సీ రోబోటిక్స్, సాబ్, సఫ్రాన్, రోల్స్ రాయీస్, ఎల్‌అండ్‌టీ, భారత్ ఫోర్జ్ లిమిటెడ్, హెచ్‌ఏఎల్, బీఈఎల్, బీడీఎల్, బీఈఎంఎల్ వంటి సంస్థలున్నాయి. ఈ ఎయిర్‌షోలో భాగంగా భారత్, విదేశీ రక్షణ కంపెనీల మధ్య రూ.75వేల కోట్ల విలువైన 251 ఒప్పందాలు జరగనున్నట్లు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. ఈ ఎయిర్‌షోలో భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌధరీ, స్వయంగా యుద్ధ విమానాన్ని నడిపి ‘గురుకుల్’ విన్యాసానికి నాయకత్వం వహించారు.