ఇమాంపేట స్కూల్ ప్రహారీ గోడ నిర్మాణం
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్,14: ఇమాంపేట కస్తూర్బా గాంధీ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాల లో స్ప్రెడ్ ఇండియా మరియు సువెన్ ఫార్మా సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ బిలిటి ద్వారా 7లక్షల రూపాయల వ్యయంతో ప్రహారీ గోడ, ప్లే గ్రౌండ్ నిర్మాణానికి రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్ప్రెడ్ ఇండియా ద్వారా ఇమాంపేట కస్తూరిబా పాఠశాల విద్యార్దినులకు తమ స్వంత ఖర్చులతో పది లక్షల రూపాయల వ్యయంతో పరుపులను అందించామని అన్నారు. స్కూల్ బిల్డింగ్ ప్రహారీ గోడ, ప్లే గ్రౌండ్ నిర్మాణానికి సహకరించిన సువెన్ ఫార్మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. పాఠశాల నందు అదనపు గదుల నిర్మాణం కోసం ఎస్టిమేషన్ రూపొందించి, అనుమతి కోసం ప్రభుత్వానికి పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు షఫి వుల్లా, వెలుగు వెంకన్న, ఎడ్ల గంగా భవాని, నాయకులు ముదిరెడ్డి రమణా రెడ్డి, గట్టు శ్రీనివాస్, జ్యోతి కరుణాకర్, రమేష్ నాయుడు, డాక్టర్ రామ్మూర్తి యాదవ్, కుంచం అంజయ్య, ధర్మా నాయక్, వల్దాసు దేవేందర్, నిమ్మల వెంకన్న, ఫరూక్, బైరబోయిన శ్రీనివాస్, విద్యాశాఖ అధికారి పూలన్, స్కూల్ స్పెషల్ ఆఫీసర్ నారాయణమ్మ, సువెన్ ఫార్మా ప్రతినిధులు పాల్గొన్నారు.