29.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఇ ఎన్నికలలో పార్టీలకు తగిన గుణపాఠం చెపుతారు: పల్లెటూరి

ఇ ఎన్నికలలో పార్టీలకు తగిన గుణపాఠం చెపుతారు: పల్లెటూరి

ఇ ఎన్నికలలో పార్టీలకు తగిన గుణపాఠం చెపుతారు: పల్లెటూరి

– బర్రెలక్కపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.. 

– స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోరం..

సిద్దిపేట యదార్థవాది ప్రతినిది

తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగుల పక్షాన మాట్లాడి కొల్లాపూర్ నియోజక వర్గంలో ఒక షెడ్యూల్ కులానికి  చెందిన 25 సంవత్సరాల యువతీ రాజకీయాల్లో పోటీ చేస్తుంటే జీర్ణించుకోలేక  ఆధిపత్య దోపిడి కులాలు దాడులకు తెగబడుతున్నాయని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థుల ఫోరం కన్వీనర్ పల్లెటూరి ప్రసాద్ అన్నారు.ఈనెల 30న జరిగే పోలింగ్ లో పార్టీలకు తగిన గుణపాఠం చెపుతారని ఓటమి భయంతోనే కొల్లాపూర్ నియోజక వర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్న చర్ల లో ప్రచారం చేస్తున్న సందర్భంలో అదే గ్రామానికి చెందిన రాజకీయ పార్టీల నేతలు ఎమ్మెల్యే అభ్యర్థి పై దాడి చేయడం హేమమైన చర్య అభ్యర్థితో పాటు ప్రచారంలో భాగమైన తన తమ్ముడు కుటుంబ సభ్యులపై దాడి చేయడం ఓటమి భయంతోనే దాడుల తెగబడుతున్నారని చెప్పి ఈ సందర్భంగా అర్థమవుతుంది నిజంగానే పాలకుల చిత్తశుద్ధి ఉంటే కనుక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఉంటే  బర్రెలక్క ఎన్నికల బరిలో నిలిచేవరు కాదని అదే పాలకుల నిర్లక్ష్యాన్ని రాష్ట్రమంతా చూస్తూ వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా ఈరోజు మద్దతుగా నిలుస్తుంటే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీల నేతలు మాత్రం దాడులకు తెగబడడం వెనక ఉన్న కుట్రను తిప్పి కొట్టాల్సిన అవసరం  ఉన్నది దాడిని తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఖండిస్తున్నాం. నిజంగానే బర్రెలక్కకు అవసరమైన రక్షణ కల్పించాలని ఎన్నికల సంఘాన్ని పోలీస్ శాఖను డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడలేని విధంగా దారడులకు తెగబడుతూనే మరోపక్క ప్రపంచంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రమని చెప్పుకుంటున్న పార్టీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. షెడ్యూల్ కులాలకు చెందిన యువత  రాజకీయాల్లోకి వస్తే జీర్ణించుకోలేక ఆధిపత్య దోపిడీ కులాలు ఈ దాడులకు తెగబడుతున్నాయని మండిపడ్డారు. అవసరమైతే రేపు కొల్లాపూర్ నియోజక వర్గానికి ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థులు వెళ్లి రాష్ట్రంలో రాజకీయ పార్టీల సంగతేందో ప్రజలకు వివరిస్తామని అన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్