25.8 C
Hyderabad
Saturday, August 2, 2025
హోమ్తెలంగాణఈ ఫి ఎఫ్ డబ్బుల కోసం లంచం ...

ఈ ఫి ఎఫ్ డబ్బుల కోసం లంచం …

ఈ ఫి ఎఫ్ డబ్బుల కోసం లంచం …
– అయినా కానీ పని
– విసిగివేసారిన ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడు
– జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు

ఈ పీ ఎఫ్ డబ్బులు కోసం అధికారులను ఆశ్రయిస్తే లంచం ఇవ్వనిదే పిఎఫ్ ఇచ్చేది లేదని ఓ ప్రైవేటు ఉపాధ్యాయుడ్ని కొంతకాలంగా ఇబ్బందులు పెట్టడంతో విసిగివేసారి కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అయినా తనకు న్యాయం దక్కకపోవడంతో చివరికి తన గోడును మీడియాకు వెళ్లబోసుకున్నారు. వివరాల్లోకి వెళితే…

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న అంబాల ప్రవీణ్ కుమార్ ఇటీవల కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో మునిగిపోయాడు. దీంతో తన పీఎఫ్ ఖాతా నుండి డబ్బులు డ్రా చేసుకుందామన్నా ఆలోచన కు వచ్చాడు. ప్రిన్సిపల్ చెన్నారెడ్డిని పిఎఫ్ డబ్బుల కోసం కోరగా ఆయన సూచన మేరకు సిద్దిపేట జిల్లా బాల రక్ష భవన్లో పని చేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ను కలిసి తన కుటుంబ పరిస్థితి వివరించాడు. అయితే రూ.3000 డబ్బులు ఇస్తేనే పని అవుతుందని, ఇలా చాలా మందికి పిఎఫ్ డబ్బులు ఇప్పిన్చానని, అందురు నేను ఎంత అంటే అంత డబ్బు ఇచ్చేవారని చెప్పాడని తెలిపారు. తన వద్ద అంత లేవనగా కనీసం వెయ్యి రూపాయలైనా ఇవ్వాలని డిమాండ్ చేయడం తో హుస్నాబాద్ మునిసిపల్ ఆఫిస్ సందులోకి వచ్చి ఇచ్చానని పేర్కొన్నారు. అయినా తన పని కాలేదని, దీంతో విసిగి వేసారి పోయినట్లు చెప్పారు. ఇప్పటికైనా అధికారులు విచారించి న్యాయం చేయాలని కోరారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్