27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణఉత్తమ ఫలితాలు సాధించాం.

ఉత్తమ ఫలితాలు సాధించాం.

ఉత్తమ ఫలితాలు సాధించాం.

సిద్ధిపేట యదార్థవాది

సిద్దిపేట పట్టణ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడైన సందర్భంగా మంగళవారం కళాశాలలో ఆయన మాట్లాడారు. ద్వితీయ సంవత్సరానికి చెందిన 362 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 66 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. అందులో 52 మంది విద్యార్థులు 1000 మార్కులకు గాను 900లకు పైగా మార్కులు సాధించినట్లు వివరించారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తామన్నారు. ఫలితాల సాధనలో ప్రత్యేక దృష్టి సారించిన అధ్యాపకులను పట్టుదలతో చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో అధ్యాపకులు అశోక్, నంట శ్రీనివాస్ రెడ్డి, వెంకటరమణ, రఘురాజు, గంగాధర్ రాజశేఖర్, షహనా కౌసర్, రాజ్యలక్ష్మి, వెంకటేష్, రమేష్ తోపాటు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్