ఉపాధి హామీ పథకం ద్వారా పని కల్పించాలి..చాడ వెంకటరెడ్డి
హుస్నాబాద్ 27 డిసంబర్
సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని చెప్పి గద్దెనేక్కిన పాలకులు పేదల సంక్షేమం మరిచారని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. మంగళవారం హుస్నాబాద్ మంగళవారం పలుకాలనిలు సందర్శించారు. కోమటి రాజవీరు, బస్ డిపో, కరీంనగర్ మడత రోడ్డు లొని కాలనీలల్లొ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇంటి నివేశన స్థలల్లో ప్రభుత్వం ద్వారా పేదలకు పక్క ఇండ్లు ముంజూరి చేయకపోవడం, అప్పుడు 3విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో పేదలకు తీరని అన్యాయం జరిగిందని, స్వరాష్ట్రం ఎర్పడిన,పేదలకు న్యాయం జరగలేదని, కెసిఆర్ ప్రభుత్వం పేదలకు పక్కఇండ్లు ముంజూరి చేయకపోవడం అన్యాయమని, పక్కఇండ్ల నిర్మాణం కోసం 5 లక్షలు మంజూరు చేసి అసంపూర్తిగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పూర్తి చేసుకునేందుకు, 3 లక్షలు మంజూరు చేయాలని, పట్టణంలోఉన్న పేద మధ్యతరగతి కూలీలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 300 రోజులు పని కల్పించి ఆదుకోవాలని ప్రజా సమస్యలు పట్టించుకొకుంటే కెసిఆర్ ప్రభుత్వంపై తీరుగుబాటు ప్రజా ఉద్యమాలు తప్పవని బిఆర్ఎస్ ప్రభుత్వానికి కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు,హుస్నాబాద్ మాజీ వైస్ గడిపె మల్లేశ్,సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి యెడల వనేష్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి ఏగ్గొజు సుదర్శన్ చారి, భారత జాతీయ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ, జనగాం రాజు కుమార్, అయిలేని మల్లారెడ్డి, జంగ విజయ, ఏలురి స్వాతి,పెరాల లక్ష్మి,మాడిశేట్టి శ్రీదర్,వంగోజు భాస్కరాచారి, నగునూరి నాగరాజు,తదితరులు పాల్గొన్నారు.