ఉపాధ్యాయులకు త్వరలో తీపి కబురు..!
హైదరాబాద్: యదార్థవాది ప్రతినిది
తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు త్వరలో తిపికబురు మంత్రి హరీశ్‌రావు… ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులను చేపట్టేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారని, సంక్రాంతి కానుకగా త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పీఆర్‌టీయూటీఎస్ నూతన సంవత్సరం డైరీని మంత్రి ఆవిష్కరించి, ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావు, ఎమ్మెల్యే కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులు పాల్గొన్నారు.