ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ అసెంబ్లీ.!
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
ఎన్నికల్లో భాగంగా హుస్నాబాద్ నియోజకవర్గ బిజెపి అభ్యర్థిగా అధిష్టానం ఎవరిని ఖరారు చేస్తుందో అని నాయకుల కార్యకర్తల లో నెలకొన్న ఉత్కంఠ నేటితో వీడిపోయింది.. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మంజులా రెడ్డి నలుగురు హుస్నాబాద్ నియోజకవర్గం తరఫున బిజెపి అభ్యర్థిత్వం కోసం పోటీ పడగా బీసీ నినాదంతో ముందుకు దూసుకెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఎట్టకేలకు బిసి అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తికి పచ్చ జెండా ఊపి హుస్నాబాద్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థిగా బరిలో నిలిపింది.. మిగతావారు ఎవరెవరు ఏ నిర్ణయం తీసుకొనున్నారు.. త్వరలో తెలుస్తుంది అధిష్టాన నిర్ణయం గౌరవించి పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ భవిష్యత్తుకు కృషి చేస్తారా లేక పార్టీ వీడుతారా అనే సందేహం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది దేశం కోసం ధర్మం కోసం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి హుస్నాబాద్ నియోజకవర్గం లో కృషి చేస్తే బాగుంటుందని లేనిచో బిజెపి ఓట్లు చిలే అవకాశం ఉందని పలువురు కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు..