ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబరు నాటికి ఫ్లై ఓవర్ బ్రిడ్జి పూర్తవ్వాలి..
రాజమండ్రి: యదార్థవాది ప్రతినిది
పనుల్లో వేగం పెంచాలి.. ఎంపీ భరత్
ఎందుకింత స్లోగా పనులు చేస్తున్నారు.. ఇలాగైతే ఎప్పటికి బ్రిడ్జి పూర్తవుతుంది’ అంటూ ఎన్హెచ్ఏ 1 ప్రాజెక్టు డైరెక్టర్ సురేందర్ పై వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ అసహనాన్ని వ్యక్తం చేశారు. శుక్రవారం మోరంపూడి జంక్షన్ వద్ద సృష్టి కాంట్రాక్టు ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ భరత్ పరిశీలించారు. అదే సమయంలో అక్కడ ఉన్న పీడీ సురేందర్ ను ఉద్దేశించి ఎందుకింత స్లోగా పనులు సాగుతున్నాయని ఎంపీ ప్రశ్నించారు. పండుగ వల్ల అని పీడీ సమాధానం చెప్పడంతో.. పండుగ కాదు..పనులు ప్రారంభించడమే చాలా ఆలస్యంగా ప్రారంభించారు.. పనులూ స్లోయే అన్నారు. ఎప్పటికి పనులు పూర్తవుతాయని పీడీని ఎంపీ భరత్ ప్రశ్నించారు. డిసెంబరు నాటికి పూర్తవుతాయని పీడీ చెప్పడంతో.. మీ పై అధికారులేమో అక్టోబర్ నాటికి అన్నారు..మీరేమో డిసెంబరు నాటికని అంటున్నారు.. ఏది కరెక్ట్ అని పీడీ సురేందర్ ను ఎంపీ సీరియస్ గా ప్రశ్నించారు. ఎట్టిపరిస్థితులోనైనా ఈ ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై డిసెంబరు నెలలో వెహికల్స్ వెళ్ళాలి..త్వరగా చేపట్టండని డీఈని ఎంపీ భరత్ ఆదేశించారు. పిల్లర్స్ నిర్మాణ పనులు పరిశీలించారు. విద్యుత్ లైన్లు మార్పును పరిశీలించారు. మిగిలిన బ్రిడ్జి లకు సంబంధించి డీపీఆర్‌లు నాకు ఎంత త్వరగా ఇస్తే అంత త్వరగా ఢిల్లీ వెళ్ళి శాంక్షన్ చేయించుకుంటానని పీడీ సురేందర్ కు ఎంపీ భరత్ తెలిపారు. టెండర్లు పిలవడం, కాంట్రాక్టర్లు రావడం ఇదంతా పెద్ద పనని, ఆలస్యం కాకుండా డీపీఆర్ లు పంపమని పీడీకి ఎంపీ భరత్ ఆదేశించారు. కొద్దిసేపు ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులను ఎంపీ భరత్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ స్మితా శుక్లా, డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ సురేష్ గౌడ్, ప్రాజెక్ట్ కంట్రోలర్ చెన్నకేశవ, నగర పార్టీ అధ్యక్షుడు అడపా శ్రీహరి, పలువురు వైసీపీ నేతలు పాల్గొన్నారు.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/34..-3.jpg)