20.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణఎన్నో ఏండ్ల కళ నెరవేర్చిన: ప్రధాని మోదీ

ఎన్నో ఏండ్ల కళ నెరవేర్చిన: ప్రధాని మోదీ

ఎన్నో ఏండ్ల కళ నెరవేర్చిన: ప్రధాని మోదీ

కొండపాక యదార్థవాది


జిల్లాలో దశాబ్దాల రైల్వే ప్రయాణ కళ నెరవేర్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి కొండపాక మండల అధ్యక్షుడు మన్నెం శశిధర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.. మంగళవారం నిజాంబాద్ లో వర్చువల్ గా సిద్ధిపేట జిల్లా పట్టణంలో సిద్దిపేట నుండి సికింద్రాబాద్ రైలు సర్వీసును నరేంద్ర మోదీ ప్రారంభించిన సందర్భంగా బిజెపి మండల నాయకులతో కలిసి మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి నూతనంగా ప్రారంభమైన రైలు సర్వీస్ దుద్దెడ రైల్వే స్టేషన్ లో పుష్పాలతో స్వాగతం పలికారు. అనంతరం శశిధర్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధిలో అనేక రకాలుగా తోడుంటుందని మోదీ 2016లో గజ్వేల్ లోని కోమటి బండకు మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభం చేయడానికి వచ్చినప్పుడు సిద్దిపేట మనోహరాబాద్ రైల్వే లైన్ కి శంకుస్థాపన చేశారన్నారు. నేడు నరేంద్ర మోడీ ఈ రైల్వే లైన్ ను, సర్వీస్ ను ప్రారంభించడం సంతోషంగా ఉందని. కేంద్రం అనేక రకాలుగా రాష్ట్రానికి సహకారిస్తున్న ఇక్కడ ఉన్న మంత్రి హరీష్ రావు ప్రారంభిస్తున్నట్లు చెప్పుకోవడం విడ్డురంగా ఉందని ఇది మంత్రి గారి దగా రాజకీయానికి నిదర్శనం అన్నారు మంత్రి చిల్లర రాజకీయాలు మానుకోవాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నలగామ శ్రీనివాస్, కార్యదర్శి కూడిక్యాల రాములు, బీజేవైఎం అధ్యక్షులు బొంగోని సురేష్ గౌడ్, గడ్డమీది రామస్వామి, రాశుల కిసాన్ రావు, దాసరి భానుచందర్, నీల సత్యం, శ్రీహరి, తాళ్లపల్లి ప్రవీణ్ గౌడ్, జిల్లా బి జే పి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్