18.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్జాతీయఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మంటలు

యదార్థవాది ప్రతినిధి కాలికట్ (కేరళ)

అబుదాబి నుంచి కాలికట్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ఫ్లైట్ ఐఎక్స్ 348 లో మంటలు చెలరేగడంతో తిరిగి అబుదాబి విమానాశ్రయంలో దిగినట్లు ఎయిర్ ఇండియా వర్గాలు తెలిపాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో మొత్తం 184 మంది ప్రయాణికులు ఉన్నారు..ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఐఎక్స్ 348లో మంటలను చూసిన పైలట్ అబుదాబికి తిరిగి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండింగ్ చేశారు. విమానం ఇంజనులో సాంకేతిక లోపం వల్లనే మంటలు చెలరేగాయని ఎయిర్ ఇండియా అధికారులు చెప్పారు. విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో విమాన ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్