సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాఖపూర్‌లో ఎయిర్‌గన్ పేలి వ్యక్తి మృతిచెందాడు. బుధవారం రాత్రి జరిగిన ఆకస్మిక ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం సలాక్ పూర్ లో జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రమాదవశాత్తు చేతిలో గన్ పేలడంతో అతను అక్కడికక్కడే చనిపోయాడు. మృతుడిని హైదరాబాద్ లంగర్‌హౌస్‌కు చెందిన ముసాఫ్‌గా గుర్తించారు. ఇతను స్నేహితులతో కలిసి సలాఖపూరూర్‌లోని బంధువుల ఇంటికి వచ్చినట్లు తెలుస్తోంది. సంఘటనపై మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.